HMPV లక్షణాలు: వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
HMPV లక్షణాలు మరియు నివారణ చిట్కాలు: చైనాలో విస్తరిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ఇప్పుడు భారతదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అనుసరించాల్సిన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
HMPV లక్షణాలు, నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి మరియు జ్వరం HMPV యొక్క సాధారణ లక్షణాలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా, ఉబ్బసం తీవ్రతరం కావడం, గురక, గొంతు బొంగురుపోవడం వంటివి తీవ్రమైన లక్షణాలుగా చెబుతున్నారు.
చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు ఉపయోగించడం వల్ల వైరస్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని పాటించాలి.
5 నుండి 16 శాతం కేసులు న్యుమోనియా వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్లీన సమస్యలు ఉంటే, పరిస్థితి మరింత దిగజారుతుంది.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తాకిన తర్వాత చేతులు కడుక్కోవాలని, మొబైల్ ఫోన్లు వాడిన తర్వాత చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
అనారోగ్యంగా ఉన్నప్పుడు బయటకు రాకపోవడమే మంచిదన్నారు. తుమ్మినా, దగ్గినా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. భౌతిక దూరం పాటించాలని వారు చెబుతున్నారు.
0 Comments